PM Kisan Scheme: రైతుల ఖాతాల్లోకి రూ.2000 జమ.. వివరాలు ఇలా చెక్ చేసుకోండి

 రైతులకు భరోసా అందించేందుకు ప్రభుత్వాలు ఎన్నో పథకాలు ప్రవేశపెడుతుంటాయి. అందులో భాగంగా తీసుకొచ్చిన పథకం పీఎం కిసాన్ యోజన. ప్రస్తుతం రైతులకు డిసెంబర్ 1న రైతుల ఖాతాల్లో జమ కావాల్సిన నగదు ఆలస్యమైంది.

PM Kisan Samman Nidhi Scheme:  రైతులకు భరోసా అందించేందుకు ప్రభుత్వాలు ఎన్నో పథకాలు ప్రవేశపెడుతుంటాయి. అందులో భాగంగా తీసుకొచ్చిన పథకం పీఎం కిసాన్ యోజన. ప్రస్తుతం రైతులకు డిసెంబర్ 1న రైతుల ఖాతాల్లో జమ కావాల్సిన నగదు ఆలస్యమైంది.

1 /5

PM Kisan Samman Nidhi Scheme:  రైతులకు భరోసా అందించేందుకు ప్రభుత్వాలు ఎన్నో పథకాలు ప్రవేశపెడుతుంటాయి. అందులో భాగంగా తీసుకొచ్చిన పథకం పీఎం కిసాన్ యోజన. ప్రస్తుతం రైతులకు డిసెంబర్ 1న రైతుల ఖాతాల్లో జమ కావాల్సిన (PM Kisan Scheme) నగదు ఆలస్యమైంది. Also Read: Pradhan Mantri Jeevan Jyoti Bima Yojana: రూ.330 చెల్లిస్తే.. రూ.2 లక్షల కవరేజీ, స్కీమ్ పూర్తి వివరాలివే

2 /5

పీఎం కిసాన్ పథకం కింద నేడు దేశ వ్యాప్తంగా దాదాపు 9 కోట్ల మంది రైతుల ఖాతాలలోకి రూ.2వేల చొప్పున మొత్తం రూ.18,000 కోట్లు జమ అవుతాయి. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) చేతుల మీదుగా అర్హులైన రైతుల ఖాతాలలోకి ఈ ఏడాదికి సంబంధించి మూడో దఫా నగదు జమ కానుంది. ఓవరాల్‌గా రైతుల ఖాతాల్లో జమ అయిన 7వ ఇన్‌స్టాల్‌మెంట్ ఇది.

3 /5

మీ ఖాతాలోకి నేటి దఫా నగదు జమ అయిందో లేదా అనేది రైతులు http://pmkisan.gov.in/ వెబ్‌సైట్‌లోకి వెళ్లి చెక్ చేసుకోవచ్చు.  WEBSITE వెబ్‌సైట్‌లో Farmer Cornerకు వెళ్లాలి.  ఆ తర్వాత Beneficiary Status మీద క్లిక్ చేయాలి. తమ అకౌంట్ నెంబర్, ఆధార్ నెంబర్, మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఆ తర్వాత గెట్ రిపోర్ట్ మీద క్లిక్ చేస్తే లబ్ధిదారుల ఖాతా వివరాలు కనిపిస్తాయి.   Also Read: BSNL Cheapest Plan: తక్కువ ధరకు రీఛార్జ్ ప్లాన్.. Airtel, Jio మరియు VIలకు షాక్!

4 /5

సాధారణంగా ఆర్థిక సాయం ఏదైనా ఉంటే లబ్ధిదారులకు సాధ్యమైనంత త్వరగా అంటే నెల తొలివారం రోజుల్లో లేకపోతే సగం నెల పూర్తి అవకముందే నిధులు లబ్ధిదారులకు అందుతాయి. ప్రస్తుతం రైతులు ఆందోళన కొనసాగించడంతో ఈ దఫా ఇన్‌స్టాల్‌మెంట్ చాలా ఆలస్యమైనట్లు తెలుస్తోంది. డిసెంబర్ 25న మధ్యాహ్నం రైతుల ఖాతాల్లో రూ.2000 నగదు జమ అవుతుంది.

5 /5

లబ్ధిదారుడైన రైతు ఖాతాలోకి డబ్బులు రాకపోతే కంగారు పడాల్సిన అవసరం లేదు. అక్కడ స్టేటస్ వివరాలు FTO (Fund Transfer Order) అని కనిపించినట్లయితే మీ వివరాలు సరిగ్గానే ఉన్నాయి. త్వరలోనే మీ బ్యాంకు ఖాతాలోకి నగదు జమ కానున్నాయని గ్రహించాలి. Also Read: SBI Cuts Interest Rates: ఎస్‌బీఐ కస్టమర్లకు శుభవార్త.. ఆ లోన్స్‌పై భారీగా తగ్గిన వడ్డీ రేట్లు